Advertisementt

ఆ టాగ్స్ ఒత్తిడిని పెంచుతాయి: సాయి పల్లవి

Mon 20th Jun 2022 04:43 PM
sai pallavi,lady power star,virata parvam,sai pallavi interview  ఆ టాగ్స్ ఒత్తిడిని పెంచుతాయి: సాయి పల్లవి
Sai Pallavi Comments On Lady Power Star Tag ఆ టాగ్స్ ఒత్తిడిని పెంచుతాయి: సాయి పల్లవి
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇలా స్టార్ హీరోల పేర్ల ముందు వారి క్రేజ్ కి నిదర్శనంగా కొన్ని పేర్లు పెట్టుకుని ఆయా హీరోల ఫాన్స్ ఆనందిస్తూ ఉంటారు. రీసెంట్ గా అల్లు అర్జున్ తన పేరు ముందు ఐకాన్ స్టార్ టాగ్ ని ఆయనే తగిలించేసుకున్నారు. ఇక తమిళంలో నయనతారని లేడీ సూపర్ స్టార్ తో పోలిస్తే.. టాలెంటడ్ బ్యూటీ సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ తో పోలుస్తూ నినాదాలు చేస్తున్నారు. అయితే తన పేరు ముందు వినబడుతున్న టాగ్ గురించి సాయి పల్లవి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో స్పష్టత నిచ్చింది. 

సాయి పల్లవి నటించిన విరాట పర్వం మూవీ సూపర్ హిట్ అయిన సందర్భంగా సాయి పల్లవి ఓ ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేరుకు ముందు ఇలాంటి టాగ్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. అందుకే వీటికి త్వరగా కనెక్ట్ కాను, నేను పోషించే కేరెక్టర్స్ నచ్చబట్టే ఎంతోమంది అభిమానులు నన్ను అభిమానిస్తున్నారు. వాళ్ళ ప్రేమను దృష్టిలో ఉంచుకుని నేను మరిన్ని మంచి పాత్రల్లో కనిపించాలి.. ఇలాంటి టాగ్స్ తలెకెత్తుకుంటే ఒత్తిడికి గురై సరిగ్గా నటించలేను. అందుకే నేను సింపుల్ గా అలాంటి వాటికి దూరంగా ఉండడానికే ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చింది.

Sai Pallavi Comments On Lady Power Star Tag:

Sai Pallavi about Lady Power Star Tag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ