Advertisementt

బాలయ్యకి ఈసారి రాజశేఖర్ ఫిక్స్

Mon 20th Jun 2022 01:01 PM
rajasekhar,balakrishna,anil ravipudi,sreleela,anil ravipudi - balakrishna combo  బాలయ్యకి ఈసారి రాజశేఖర్ ఫిక్స్
Rajasekhar in NBK-Anil Ravipudi project? బాలయ్యకి ఈసారి రాజశేఖర్ ఫిక్స్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ వేషం వెయ్యబోతున్నారు. ఇది పాత న్యూస్. అఖండ సినిమా అప్పటినుండి రాజశేఖర్ బాలయ్య కి అపోజిట్ రోల్ చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ అఖండ లో బాలకృష్ణ తో హీరో శ్రీకాంత్ తలపడగా, ఇప్పుడు NBK 107 లో గోపీచంద్ మలినేని బాలకృష్ణ కి విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు రాజశేఖర్ ఖచ్చితంగా బాలయ్య మూవీలో కనిపిస్తారని అంటున్నారు. అది కూడా బాలకృష్ణ - అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమాలో అని తెలుస్తుంది.

అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమాలో నెగెటివ్ రోల్ చేసేందుకు రాజశేఖర్ ని ఒప్పించారని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక చేపట్టినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాజశేఖర్ తో అనిల్ రావిపూడి చర్చలు జరిపారని, ఈ విషయంలో రాజశేఖర్ కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ఇక అనిల్ రావిపూడి - బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే మూవీ తండ్రి-కూతుళ్ళ అనుబంధం నేపధ్యలో సాగే కథ అని, బాలయ్య కూతురిలా హీరోయిన్ శ్రీలీల నటించబోతున్నట్లుగా అనిల్ రావిపూడి ఎప్పుడో రివీల్ చేసారు. 

Rajasekhar in NBK-Anil Ravipudi project?:

Rajasekhar to surprise Balakrishna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ