Advertisementt

ఎన్టీఆర్-కొరటాల ఓ ఇంటర్వెల్ బ్యాంగ్

Mon 20th Jun 2022 09:17 AM
ntr,koratala,ntr30 update,ntr - koratala combo,ntr30 update  ఎన్టీఆర్-కొరటాల ఓ ఇంటర్వెల్ బ్యాంగ్
NTR30 latest update ఎన్టీఆర్-కొరటాల ఓ ఇంటర్వెల్ బ్యాంగ్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో జనతా గ్యారేజ్ తర్వాత తెరకెక్కబోతున్న NTR30 పై అంచనాలు మాములుగా లేవు. అందులోను ఎన్టీఆర్ బర్త్ డే రోజున కొరటాల NTR30 కోసం చేసిన వీడియో చూస్తే ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఫిలిం లా ఉండబోతుంది అని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే కొరటాల శివ కూడా చెప్పారు. ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా ఫుల్ యాక్షన్ తో కూడుకున్నదిగా ఉండబోతుంది అని. అయితే తాజాగా కొరటాల - ఎన్టీఆర్ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

NTR30 లో ఓ కీలక ఎపిసోడ్ కోసం భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. అందుకే సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా లేట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సెట్ బ్లాస్ట్ సీన్ లో ఎన్టీఆర్ యాక్షన్ అదరిపోతుందట. ఎన్టీఆర్ ని గతంలో ఎన్నడూ చూడని యాక్షన్ మోడీ లో కొరటాల చూపించబోతున్నారట. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం స్క్రిప్ట్ లో ఉన్న సముద్రంలో జరిగే ఓ భారీ ఫైట్ ఉండేది అని.. ఇప్పుడు ఈ యాక్షన్ సీన్ కోసం ఆ సముద్రం ఫైట్ ని లేపేసారని అంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ - కొరటాల మూవీ ఆగష్టు నుండి సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు.

NTR30 latest update:

NTR - Koratala movie NTR30 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ