Advertisementt

జబర్దస్త్: ప్రోమో కోసం మరో మోసం

Sun 19th Jun 2022 03:56 PM
jabardasth,varsha,indraja,jabardasth latest promo viral  జబర్దస్త్: ప్రోమో కోసం మరో మోసం
Jabardasth latest promo viral జబర్దస్త్: ప్రోమో కోసం మరో మోసం
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లో ప్రోమోస్ కోసం ఈమధ్యన చాలా విషయాలను హైలెట్ చేస్తున్నారు. గత వారం ఇంద్రజ నెటిజెన్స్ అడిగిన ప్రశ్నను ఓపెన్ గానే కమెడియన్స్ ని అడిగిన ఇంట్రెస్టింగ్ ప్రోమో కట్ చేసారు. అలాగే రష్మీ, సుధీర్, వర్ష - ఇమాన్యువల్ లవ్ ట్రాక్ ని హైలెట్ చేస్తూ చాలాసార్లు ప్రోమోస్ కట్ చేసి షోస్ పై ఆసక్తిని కలిగించే ప్లాన్ చేస్తుంటారు నిర్వాహకులు. తాజాగా జబర్దస్త్ వచ్చే వారం ఎపిసోడ్ లో వర్ష ఇమ్మాన్యువల్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈమధ్యనే జబర్దస్త్ టీం అంతా చాలాబాగా కలిసిపోయామని, మా ఎమోషన్స్ నిజం అని, టీఆర్పీ కోసం కాదు అని చెప్పిన వర్ష ఇప్పుడు ఇమ్మాన్యువల్ గురించి షాకింగ్ గా మాట్లాడింది. తర్వాత జేడ్జ్ ఇంద్రజ స్కిట్ అవ్వగానే లవర్స్ అంటే అనుమానాలు రావడం సజహం. అలాంటిది మీ మధ్యలో ఎప్పుడైనా ఆ అనుమానాలు వచ్చాయా అని అడగగా.. దానికి వర్ష సమాధానంగా నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉంది అంటే అది నా ఇమ్మూ మాత్రమే, ఎవరు ఏమనుకున్నా, నాకు ఎటువంటి సమస్య లేదని చెప్పుకొచ్చింది. మా రిలేషన్ గురించి ఎవరేం అనుకున్నా తనకి ఇబ్బంది లేదని చెప్పింది. అలాగే ఇమ్ము ని చూస్తూ ప్రేమని ఒలకపొసింది వర్ష. అంటే ఇదంతా ఓ ప్రోమోలో చూపించారు. ఇది నిజమో.. లేదంటే మోసమో మరి. 

Jabardasth latest promo viral:

Jabardasth latest promo goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ