అంటే సుందరానికి తో నాని ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సినిమా హిట్ పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిజంగానే సినిమా సూపర్ హిట్ అన్నారు.. కానీ కలెక్షన్స్ రావడం లేదు. కేవలం మూడు రోజుల పాటు అంటే సుందరానికి కలెక్షన్స్ కళకళలాడాయి. అయినా ఓ అనుకున్నంత కాదు. సోమవారం నుండే అంటే సుందరానికి అసలు రంగు బయటపడింది. ఆ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. మొదటివారానికి నాని కి ప్రేక్షకులు షాకిచ్చారు. రెండో వారంలో విరాట పర్వం పిడుగు పడింది. విరాట పర్వం సినిమా కి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది.
అయినా సాయి పల్లవి క్రేజ్ తో సినిమా ఆడేస్తుంది అనుకున్నారు. కానీ విరాట పర్వం సినిమా కి కలెక్షన్స్ రావడం లేదు. శని, ఆది వారం రోజుల్లో కూడా విరాట పర్వం పెరఫార్మెన్స్ వీక్ గా ఉండడంతో అంటే సుందరానికి కలిసొస్తుంది.. ఏమో అని డౌట్ పడుతున్నారు. కానీ అంటే సుందరానికి కూడా విరాట పర్వం టాక్ ఏమి కలిసొచ్చేలా కనిపించడం లేదు. రెండో వారంలో సుందరం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.