మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ తో మళ్ళీ బిజీగా మారారు. రీసెంట్ గానే బాబీ తో మెగా 154 సెట్స్ లో దర్శకుడు సుకుమార్ ఉన్న పిక్ బయటకి వచ్చింది. మరోపక్క గాడ్ ఫాదర్, ఇంకోపక్క భోళా శంకర్ షూటింగ్స్ అంటూ మెగాస్టర్ బిజీ బిజీ గా మారిపోయారు. ఆచార్య తరవాత ఓ నెల రోజుల పాటు లాంగ్ వెకేషన్స్ కి వెళ్లోచ్చిన చిరంజీవి ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీ అయ్యారు. అయితే మోహన్ రాజా దర్శకత్వంలో చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది అని తెలుస్తుంది.
గాడ్ ఫాదర్ ని ఆగష్టు లో కానీ, సెప్టెంబర్ లో కానీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. మొన్నామధ్యన గాడ్ ఫాదర్ ఆగస్ట్ 12 న రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆగష్టు కానీ, సెప్టెంబర్ కానీ రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లుగా మెగాస్టార్ రీసెంట్ గా ఓ కార్యక్రమంలో చెప్పడంతో మెగా ఫాన్స్ కాస్త ఉత్సాహం గా ఉన్నారు. ఆచార్య తో పోయిన ఆనందాన్ని గాడ్ ఫాదర్ తో తిరిగి తెచ్చుకుందామనే ధీమాలో ఉన్నారు ఫాన్స్. ఈసినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ నటించడంతో మరింత హైప్ పెరిగింది.