Advertisementt

అప్పుడే విరాట పర్వం ఓటిటిలోకి

Sun 19th Jun 2022 12:53 PM
virata parvam,netflix,rana,sai pallavi  అప్పుడే విరాట పర్వం ఓటిటిలోకి
Virata parvam ott date locked? అప్పుడే విరాట పర్వం ఓటిటిలోకి
Advertisement
Ads by CJ

నిన్నగాక మొన్న శుక్రవారం వారమే రానా - సాయి పల్లవిల విరాట పర్వం మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఏడాదిన్నరగా షూటింగ్ పూర్తి చేరుసుకుని విడుదల కోసం వెయిట్ చేస్తున్న విరాట పర్వానికి మేకర్స్ జూన్ 17 న మోక్షం కలిగించారు. అసలైతే విరాట పర్వం ఓటిటిలోనే రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ మేకర్స్ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసారు. అయితే థియేటర్స్ లో విడుదలైన విరాట పర్వం డాక్యుమెంటరిగా ఉంది అని, ఈ సినిమా ఓటిటి లో అయితే పర్ఫెక్ట్ గా ఉండేది అని చాలామంది అన్నారు. 

ఇక జూన్ 17 న విడుదలైన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవి కోసం థియేటర్స్ కి వెళ్లలేని వారు ఇంట్లో ఓటిటిలో విరాట పర్వం చూడాలని అనుకుంటున్నారు. విరాట పర్వం మూవీ జూలై రెండో వారంలో ఓటీటీలోకి రిలీజ్ కానుంది అని తెలుస్తుంది. ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను 15 కోట్ల‌కు చేజిక్కించుకుంద‌ట‌. మరి విరాట పర్వం ఓటిటి కోసం జులై సెకండ్ వీక్ వరకు వేచి చూడాల్సిందే.

Virata parvam ott date locked?:

Virata Parvam Digital Rights Acquired By Netflix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ