Advertisementt

NBK107 సెట్స్ లో శృతి హాసన్

Sun 19th Jun 2022 12:40 PM
nbk107,shruti haasan,balakrishna,gopichand malineni  NBK107 సెట్స్ లో శృతి హాసన్
Shruti Haasan joins NBK107 sets NBK107 సెట్స్ లో శృతి హాసన్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న NBK107 ఫస్ట్ లుక్ తోనూ అలాగే ఫస్ట్ టీజర్ తో అంచనాలను సెట్ చేసింది. బాలకృష్ణ లుక్స్, ఆయన డైలాగ్ డెలివరీ సినిమాకి మెయిన్ హైలెట్స్ గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ ఓ పాత్రని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చెయ్యగా, మరొకటి రొమాంటిక్ గా డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ పాత్రకే హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ ని తీసుకొచ్చాడు దర్శకుడు. బాలయ్య సినిమాలో శృతి హాసన్ అంటే మాములు హైప్ కాదు. అయితే హీరోయిన్ గా ఎంపికయ్యాక ఓపెనింగ్ లో జాయిన్ అయిన శృతి హాసన్.. షూటింగ్ లో ఈ రోజే జాయిన్ అయినట్లుగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు.

క్రాక్ తో తనకు కం బ్యాక్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని అడగడంతో శృతి హాసన్ మళ్ళీ బాలయ్య తో ఆయన దర్శకత్వంలో సినిమా చేయబోతుంది. గోపీచంద్ తో శృతి హాసన్ ఉన్న పిక్ ని షేర్ చేస్తూ శృతి హాసన్ కి NBK 107 సెట్స్ లోకి ఆహ్వానం పలికారు మేకర్స్. ప్రస్తుతం NBK107 షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. త్వరలోనే NBK107 యూనిట్ ఓ 20 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ కోసం అమెరికాకి వెళ్లబోతుంది. 

Shruti Haasan joins NBK107 sets:

NBK107: Shruti Haasan enters the scene

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ