విరాట పర్వం మూవీ ప్రమోషన్స్ లో హీరోయిన్ సాయి పల్లవి కాశ్మీరీ ఫైల్స్ సినిమా చూసాను అని, కాశ్మీర్ పండిట్స్ హత్యలు లాగే ముస్లిమ్స్ గోవధలు చేస్తారు అనే అర్ధంలో కాస్త వివాదాస్పదంగా మాట్లాడడంతో.. సాయి పల్లవి పై నెటిజెన్స్, బిజెపి కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. సాయి పల్లవి అలా మాట్లాడడం సరికాదు అని కొందరంటే.. సాయి పల్లవి కరెక్ట్ గా మాట్లాడింది అన్నారు. తర్వాత విరాట పర్వం ప్రెస్ మీట్ లో సాయి పల్లవి ని ఈ విషయమై స్పందించమంటే ఇప్పుడు సమయం కాదు అని దాట వేసింది. తాజాగా ఈ విషయం పై సాయి పల్లవి స్పందించింది. ఇదే మొదటిసారి నేను ఇలా వివరణ ఇవ్వడానికి వస్తున్నాను..
ఒక మాట అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటాను. నేను చెప్పే ఆన్సర్స్ మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నేను కరెక్ట్ గా మాట్లాడలేకపోతే అది రాంగ్ గా ప్రోజెక్ట్ అవుతుంది. నేను ఇది ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఎవరిని సపోర్ట్ చెయ్యను, మన నమ్మకాలూ చెప్పుకునే ముందు మనం మంచి మనుషుల కింద ఉండాలి, ఆ టాపిక్ మీద మాట్లాడుకుంటూనే.. రెండు సంఘటన గురించి చెప్పాను. నన్ను ఆ సంఘటనలు చాలా ఆలోచింపజేశాయి. కాశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ తో మాట్లాడే అవకాశం దొరికింది. అప్పుడు చెప్పాను ఆయనకి.. ఆ సంఘటనలు చాలా డిస్ట్రెబ్బింగ్ గా ఉన్నాయి. నేను అలాంటి సంఘటనలు కించపరిచేలా మాట్లాడను. నేను చెప్పినదాని గురించి వేరేలా తీసుకున్నారు. కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్ పూర్తి ఇంటర్వూ చూడకుండా కేవలం ఓ బిట్ ని తీసుకుని దీనిని వివాదంగా మార్చారు.
ఈ విషయంలో నాకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు. నా ఇంటెన్షన్ అలాంటింది కాదు అంటూ సాయి పల్లవి ఓ వీడియో ద్వారా సోషల్ మీడియా లో వివరణ ఇచ్చింది.