ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలయికలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ప్రభాస్ అటు సలార్, ఇటు ప్రాజెక్ట్ కె షూటింగ్ అంటూ బిజీ బిజీగా మారారు. అసలే స్లిమ్ లుక్ లో ప్రభాస్ ని చూసిన ఆయన ఫాన్స్ ఎక్కడా ఆగడం లేదు. ప్రాజెక్ట్ కె తో పాటుగా సలార్ లోను ప్రభాస్ అదే స్లిమ్ లుక్ లో కనిపిస్తారని వారు ఆరాటపడుతున్నారు. అయితే ప్రాజెక్ట్ కే షూటింగ్ కొన్ని రోజులు వాయిదాపడబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
కారణం హీరోయిన్ దీపిక పదుకొనే అని, దీపిక పదుకొనే ఈమధ్యనే షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ రాగా.. ఆమెకి హెల్త్ ఇష్యుస్ వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది అని, దీపిక కొద్ది రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించడంతో ప్రాజెక్ట్ కే షూటింగ్ వాయిదాపడింది అంటున్నారు. కానీ ఈ ప్రచారానికి ప్రాజెక్ట్ కె యూనిట్ అడ్డుకట్టలు వేస్తుంది. దీపిక హెల్త్ వలన ప్రాజెక్ట్ కె షూటింగ్ కి ఎలాంటి సమస్యలు లేవని, దీపిక పదుకొనే చాలా ప్రొఫెషనల్ గా ఉంది అని, ఆమె నిర్మాతగా సినిమాలు చేసి ఉండడంతో నిర్మాతల కష్టాలు తెలుసు అని, నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతోనే దీపిక షూటింగ్ లో పాల్గొంటుంది అని, అటు ప్రభాస్ కూడా దీపిక కి అండగా ఉంటూ.. ఆమెకి మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.