రామ్ చరణ్ - శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. రామ్ చరణ్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్ కోసం ఉపాసన తో కలిసి వెకేషన్స్ కి వెళ్లి వచ్చారు. అలాగే కియారా అద్వానీ కూడా బాలీవుడ్ లో ఆమె నటించిన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది.. సో అన్ని సెట్ అయ్యాక త్వరలో హైదరాబాద్ లోనే RC15 కొత్త షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుని మారేడుమిల్లు అడవులకి షిఫ్ట్ అవ్వబోతుంది. ఈ సినిమా లో రామ్ చరణ్ స్టూడెంట్ గాను, వయసు మళ్ళిన వ్యక్తిగానూ కనిపించనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ రెండు లుక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా మరోసారి RC15 టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. గతంలో అనుకున్నట్టుగానే అధికారి టైటిల్ ని ఫైనల్ చేసే యోచనలో చరణ్ మరియు శంకర్ లు ఉన్నారని అంటున్నారు. ఈ టైటిల్ ముందే రివీల్ చెయ్యాలి అనుకున్నారు. అధికారి అయితే పాన్ ఇండియా కి కరెక్ట్ సరిపోతుంది కాబట్టి ఇదే ఫైనల్ చేసేస్తారని అంటున్నారు. చూద్దాం RC 15 కి ఏ టైటిల్ రివీల్ అవుతుందో అనేది.