Advertisementt

అంతన్నారు.. ఇంతన్నారే..

Fri 17th Jun 2022 06:16 PM
ante sundaraniki,nani,ante sundaraniki collections  అంతన్నారు.. ఇంతన్నారే..
Ante Sundaraniki first week collections అంతన్నారు.. ఇంతన్నారే..
Advertisement
Ads by CJ

నాని అంటే సుందరానికి గత శుక్రవారం విడుదలైంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అన్నారు, క్రిటిక్స్ అద్భుతమైన రేటింగ్స్ ఇచ్చారు. భారీ టార్గెట్ అంటే నాని కెరీర్ లోనే మంచి బిజినెస్ జరిగిన అంటే సుందరానికి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి నానా కష్టాలు పడుతుంది. నిన్నటికి అంటే సుందరానికి విడుదలై ఒక్క వారం పూర్తయ్యింది. ఈ సినిమా హిట్ అన్నప్పటికీ.. మూడునాళ్ళ ముచ్చటగానే కలెక్షన్స్ ఉన్నాయి. మొదటి మూడు రోజులు వీకెండ్ కావడంతో మంచి వసూళ్లు సాధించడంతో ఆహా ఓహో.. అన్నారు. కానీ వీక్ డేస్ మొదలయ్యేసరికి అసలు రంగు బయటపడింది.

సోమవారం నుండే థియేటర్స్ లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు. సినిమా హిట్ అన్నారు. నాని సూపర్ అన్నారు. కానీ వీక్ డేస్ లో వీకైపోయాయి కలెక్షన్స్. మొదటి వారం పూర్తయ్యేలోపు అంటే సుందరానికి ప్రపంచ వ్యాప్తంగా 18.39 కోట్లు వసూళ్లు చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 12 కోట్లు రావాలి. అది అసాధ్యం అంటూ ట్రేడ్ నిపుణులు తేల్చేస్తున్నారు. హిట్ సినిమా కి మరీ ఇంత ఘోరమైన కలెక్షన్స్ ఏమిటి అంటూ నోటి మీద వేలేసుకుంటున్నారు జనాలు.

Ante Sundaraniki first week collections:

Nani Ante Sundaraniki first week collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ