ఫిదా సినిమాలో భానుమతి గా హైబ్రీడ్ పిల్ల, ఒక్కటే పీస్ అంటూ మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి, ఆ సినిమాలో వరుణ్ తేజ్ ని డామినిట్ చేసింది. వరుణ్ తేజ్ కూడా సాయి పల్లవితో పోటీపడినా.. అక్కడ సాయి పల్లవిని హైలెట్ అయ్యింది. ఆతర్వాత శ్యామ్ సిగ్ రాయ్ లో సాయి పల్లవి, భారతనాట్యానికి, పెరఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమా మొత్తం నాని vs సాయి పల్లవి అన్నట్టుగా నడిచింది. ఇక ఇప్పుడు వెన్నెల గా సాయి పల్లవి తన నటనతో మరోసారి మెస్మరైజ్ కాదు మ్యాజిక్ చేసింది. విరాట పర్వం కథ మొత్తం వెన్నెల కేరెక్టర్ చుట్టూనే రాసుకున్నాడు దర్శకుడు వేణు.
సాయి పల్లవి షో అనేంతగా విరాట పర్వంలో ఆమె నటన కనబరిచింది. వెన్నెలగా గుర్తుండిపోయే ప్రతిభ చూపించింది. ఎమోషనల్ సీన్స్ లోను సాయి పల్లవి నటన అద్భుతం, రానా కూడా రవన్న కేరెక్టర్ లో ఆదరగొట్టినా సాయి పల్లవి నటన ముందు కాస్త తగ్గాడనే చెప్పాలి. భానుమతి, వెన్నెల వంటి బలమైన పాత్రలు దొరికితే సాయి పల్లవి ని మించి ఎవరూ కనిపించరు అనేది రుజువు చేసింది.. వెన్నెలగా సాయి పల్లవి లుక్స్ విషయంలోనూ, ఆమె పెరఫార్మెన్స్ విషయంలోనూ కామెంట్ చెయ్యడానికి ఏమిలేదు.. కాంప్లిమెంట్స్ ఇవ్వడం తప్ప అన్నట్టుగా బెస్ట్ ఇచ్చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తే, యాక్షన్ సీన్స్‌లో విజిల్స్ కొట్టించింది సాయి పల్లవి. విరాట పర్వం చూసాక అందరూ సాయి పల్లవి పెరఫార్మెన్స్ గురించే ముచ్చట పెడుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు..