Advertisementt

పవన్ కళ్యాణ్ కి మెగా అండ

Thu 16th Jun 2022 08:48 PM
mega family,janasena chief,pawan kalyan,varun tej,vaishnav tej,niharika,sai dharam tej  పవన్ కళ్యాణ్ కి మెగా అండ
Mega Family stands for Pawan Kalyan పవన్ కళ్యాణ్ కి మెగా అండ
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోడెద్దుల బండి లాగుతున్నారు. రెండు పడవల మీద కాళ్ళేసి రాజకీయాలు, సినిమాలు అంటూ హడావిడిగా తిరుగుతున్నారు. పాలిటిక్స్, సినిమా షూటింగ్స్ తో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలను ఆదుకునేందుకు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా మరణించిన రైతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఓదార్చడమే కాకుండా ఒక్కొక్క ఫ్యామిలీకి ఓ లక్ష సహాయం చేస్తూ వస్తున్నారు. పవన్ రైతు కుటుంబాలను ఆదుకుంటుంటే.. పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ అండగా మారింది.

ఆయన ఫ్యామిలీ లోని హీరోలు, ఫ్యామిలీ సభ్యులు కొందరు పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి 35 లక్షల విరాళం ఇచ్చారు. అందులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు తలో పది లక్షలు ఇవ్వగా, వైష్ణవ్ తేజ్, నిహారిక, మెగా ఫ్యామిలీ మెంబెర్ ఒకరు తలో ఐదు లక్షలు ఇవ్వడమే కాకుండా.. నిహారిక పవన్ కళ్యాణ్ కి థాంక్స్ కూడా చెప్పింది. ప్రజలకు ఆశావాద, విశ్వాసంతో కూడిన భవిష్యత్ ను నిర్మించాలనే మీ బృహత్తర ప్రయత్నంలో ఇలా చిన్న సాయం చేసేందుకు మాకు అవకాశం కల్పించారు. ఎప్పటికి మా నాయకుడు నువ్వే బాబాయ్ .. నీకు థాంక్స్ బాబాయ్ అంటూ ట్వీట్ చేసింది. 

Mega Family stands for Pawan Kalyan :

Mega Family stands for Janasena Chief Pawan Kalyan and donated huge money

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ