నయనతార పెళ్లి చేసుకున్న తర్వాతి రోజే తిరుమల తిరుపతి మాఢవీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగిన కారణంగా వివాదాలు చుట్టు ముట్టడడమే కాదు, టిటిడి నయనతారకి నోటీసు లు జారీ చెయ్యడం కలకలం సృష్టించింది. ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా అలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి అంటే రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్, నాగార్జున లాంటి స్టార్స్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర మూవీ ట్రైలర్ మూవీ రెండు రోజుల క్రితమే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు అదే ట్రైలర్ వలన రణబీర్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు.
అది బ్రహ్మాస్త్ర ట్రైలర్ లోని రణబీర్ కపూర్ గుడిలోకి ఎంట్రీ ఇచ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో రణబీర్ కపూర్ ఎగిగి గుడి గంటలను కొడతాడు. అయితే రణబీర్ కపూర్ ఆ సన్నివేశంలో కాళ్లకు బూట్లు ధరించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. గుడిలోకి బూట్లు వేసుకుని రావడమే తప్పు, అదే బూట్ల తో ఎగిరి గుడి గంట ఎలా కొడతారు అంటూ హిందూ సంఘాలు, నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు రణబీర్, ఆయన ముఖర్జీల బ్రహ్మాస్త్రని బాయ్‌కాట్ చెయ్యాలంటూ బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర హాష్ టాగ్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.