కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న బైలింగువల్ మూవీ షూటింగ్ నిన్నమొన్నటివరకు హైదరాబాద్ లోనే జరిగింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ నుండి శరత్ కుమార్, ప్రభు లాంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ లాంటి వాళ్ళు ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ నెల 22 న విజయ్ బర్త్ డే కావడంతో ఆయన ఫాన్స్ #Thalapathy66 లుక్ లేదా టైటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే వంశీ పైడిపల్లి - విజయ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీకి వారసుడు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే టైటిల్ ని విజయ్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 22 న అధికారికంగా ప్రకటించనున్నారు అని, తమిళంలో వేరే టైటిల్ పెడతారనే టాక్ మొదలైంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇక అక్టోబర్ కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీద వంశీ పైడిపల్లి దృష్టి పెడతారని తెలుస్తుంది.