కరోనా లాక్ డౌన్, ఎలక్షన్స్ తో అప్పులు పాలైనట్టుగా కమల్ హాసన్ విక్రమ్ ప్రమోషన్స్ లో చెప్పడం అందరికి షాకిచ్చింది. అంత పెద్ద నటుడు అప్పులు పాలవడం ఏమిటి అంటూ అందరూ అవాక్కయ్యారు. కొన్నాళ్లుగా విజయం లేని కమల్ హాసన్ మధ్యలో ఎలక్షన్స్ కోసం పార్టీ పెట్టి మూసివేయడంతో ఆయన డబ్బు విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా కమల్ నిర్మించిన విక్రమ్ సినిమా పాన్ ఇండియాలో సూపర్ హిట్ అవడమే కాదు, సెకండ్ వీక్ లోను విక్రమ్ కలెక్షన్స్ జోరు మాములుగా లేదు. రెండు వారాల్లోనే సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో కమల్ హాసన్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.
విక్రమ్ హిట్ అయ్యి 100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవ్వగానే అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుండి, డైరెక్టర్ లోకేష్ వరకు, అలాగే గెస్ట్ గా రోలెక్స్ కేరెక్టర్ లో అదరగొట్టిన సూర్యలకి బహుమతులు ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చిన లాభాలతో కమల్ హాసన్ తన అప్పులు తీర్చుకుంటాను అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. విక్రమ్ కి వచ్చిన లాభాలతో అప్పులు తీర్చడమే కాదు, నా సన్నిహితులకు నా చేతనైనంత సహాయం కూడా చేస్తాను. కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాక ఎవరన్నా అడిగితే మొహమాటం లేకుండా ఇవ్వడానికి ఏం లేదని కూడా చెప్పేస్తానని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.