Advertisementt

ప్రభాసే నెంబర్ 1

Wed 15th Jun 2022 07:12 PM
prabhas,ormax media survey,ntr,mahesh babu  ప్రభాసే నెంబర్ 1
Tollywood Top Heroes By Ormax Media Survey ప్రభాసే నెంబర్ 1
Advertisement
Ads by CJ

ప్రభాస్ అందరికన్నా ముందే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. బాహుబలితో ప్రపంచంలో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ డిస్పాయింట్ చేసినా.. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఆ విషయాన్ని మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రూవ్ చేసింది. ప్రతి నెలలో ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తోంది. ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో స్టార్స్ క్రేజ్ ని, మీడియాలో ఎవరికి ఎక్కువ రేంజ్ ఉంది అనే దానిని బేస్ చేసుకుని మరీ ర్యాంక్ లని ప్రకటిస్తుంది. ఈ కోవలో ఏప్రిల్ లో మోస్ట్ పాపులర్ యాక్టర్ గా నెంబర్ 1 ప్లేస్ లో ఎన్టీఆర్ ఉన్నారు.

ఇప్పుడు మే నెల సర్వే లో ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో ఉన్న ప్రభాస్ నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చేసారు. సాహో, రాధే శ్యామ్ వరస ప్లాప్స్ ఉన్నప్పటికీ ప్రభాస్ సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవడం తో ఆయన మే నెలకి ఫస్ట్ ప్లేస్ కి చేరుకున్నారు. ప్రభాస్ తర్వాత మహేష్ బాబు సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు. ఏప్రిల్ లో 5th ప్లేస్ లో ఉన్న మహేష్ మే కి వచ్చేసరికి 2nd ప్లేస్ లోకి వచ్చేసారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మూడో ప్లేస్ కి చేరిపోయారు. ఏప్రిల్ 1st ప్లేస్ లో ఉన్న ఎన్టీఆర్ మే కి వచ్చేసరికి మూడో స్థానానికి పడిపోయారు. 

ఆ తర్వాత స్థానాల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ వరస స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ప్రభాస్ మే నెల లో ఫస్ట్ ప్లేస్ కి రావడం చూసిన ఆయన ఫాన్స్ మళ్ళీ ఖుషి అవుతున్నారు.

Tollywood Top Heroes By Ormax Media Survey:

Ormax Media Survey 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ