నయనతార కెరీర్ మొదలైనప్పటినుండి ఇప్పటివరకు ఎక్కడా డౌన్ ఫాల్ కాలేదు. యంగ్ అండ్ స్టార్ మరియు విమెన్ సెంట్రిక్ మూవీస్ తోనూ, గ్లామర్ రోల్స్ తోనూ నయనతార ఫుల్ బిజీగానే ఉంటుంది. కాకపోతే కొన్నేళ్లుగా మీడియా కి దూరంగా ఉంటున్న నయనతార ఇప్పుడు ఆ విషయంలో చాలావరకు మారింది. ఇక తాజాగా నయనతార తన దగ్గరకి వచ్చే దర్శకనిర్మాతలకు కొత్తగా కండిషన్స్ పెడుతుందట. అంటే తన దగ్గరకి వస్తున్న దర్శకనిర్మాతలకు గ్లామర్ రోల్స్ లేని అందమైన కథలని, అలాగే ఎక్కువగా విమెన్ సెంట్రిక్ కథలనే తేవాలని కండిషన్ పెట్టినట్లుగా కోలీవుడ్ మీడియా టాక్.
తాను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అని, ప్రస్తుతం గ్లామర్ రోల్స్ చేసే మూడ్ లేదని చెబుతుందట. కాకపోతే నయనతార విగ్నేష్ శివన్ తో పెళ్ళికి ముందే అంటే గత కొన్ని రోజులకుగా స్టార్ హీరోల సినిమాల్లోనూ గ్లామర్ కి దూరంగానే ఉంటుంది. ఎక్కువగా చుడీదార్స్, సారీస్ లోనే కనబడుతుంది. అలాగే లేడి ఓరియెంటెడ్ మూవీస్ కి ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత పర్టిక్యులర్ గా ఆ మూవీస్ మాత్రమే చెయ్యాలని నయనతార డెసిషన్ తీసుకుని మరీ ఆ కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తుంది. కానీ ఈ విషయంలో దర్శకనిర్మాతలు మాత్రం కంగారు పడుతున్నారట.