స్వీట్ అండ్ క్యూట్ హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు విరాట పర్వం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వుంది. టీం తోనూ, సోలో గాను ఇంటర్వూస్ ఇస్తూ సాయి పల్లవి ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేస్తుంది. విరాట పర్వం పై అంచనాలు పెంచేస్తుంది. అయితే తాజాగా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలతో ఆమె నెటిజెన్స్ నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కోవడమే కాదు.. ఆమె నటించిన విరాట పర్వం చూడబోము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాయి పల్లవి విరాట పర్వం ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ మధ్యనే కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశాను, కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కశ్మీరి పండింట్లను ఎలా చంపారో ఆ సినిమాలో చూపించినట్లుగా.. ఇప్పుడు కూడా గోవధ చేస్తున్నారంటూ.. ఆవును తీసుకెళ్తున్న ముస్లీం డ్రైవర్‌ను కొట్టి.. జై శ్రీరామ్ అనాలన్నారు. కానీ అప్పుడు జరిగిన దానికి.. ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది అంటూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం అయ్యింది. సాయి పల్లవి చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం లేపడమే కాదు, ఆమె నటించిన విరాట పర్వం ని బాయ్ కాట్ చెయ్యాలంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.