Advertisementt

సుందరానికీ వీక్ డే కష్టాలు

Wed 15th Jun 2022 12:43 PM
ante sundaraniki,nani,nazriya,vivek athreya,ante sundaraniki box-office collections  సుందరానికీ వీక్ డే కష్టాలు
Ante Sundaraniki week day collections సుందరానికీ వీక్ డే కష్టాలు
Advertisement
Ads by CJ

నాని అంటే సుందరానికీ సినిమా సూపర్ హిట్ అన్నారు, మౌత్ టాక్ తో నాని సినిమాని ఎత్తేసారు ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా కొంతమంది మంచి రేటింగ్స్ ఇచ్చారు. నాని శ్యామ్ సిగ్ రాయ్ తర్వాత భారీ హిట్ కొట్టాడు అన్నారు. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. నాని మీదున్న నమ్మకం, వివేక్ ఆత్రేయ కామెడీ మీదున్న అంచనాలతో సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. అనుకున్నట్టే నాని, నజ్రియా పెరఫార్మెన్స్ సూపర్, సెకండ్ హాఫ్ అదుర్స్ అన్నారు. కానీ ఫస్ట్ హాఫ్ వీక్, అలాగే నిడివి ఎక్కువ కావడం మైనస్ లు సుందరాన్ని వెంటాడాయి. ఇప్పుడు మూడు రోజుల ముచ్చట అంటే సుందరానికీ అన్నట్టుగా ఉంది వ్యవహారం.

ఆదివారం ముగియగానే నాని అంటే సుందరానికీ వీక్ డే కష్టాలు మొదలైపోయాయి. ముఖ్యంగా వీక్ డేస్, అలాగే స్కూల్స్ ఓపెన్ అవడం ఈ సినిమాకి బ్యాడ్ లక్ గా మారింది. సోమవారం, మంగళవారం అంటే సుందరానికీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం లక్షల్లోనే ఏపీ, అలాగే తెలంగాణ లో కలెక్షన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల థియేటర్స్ ఫుల్ కూడా అవడం లేదు. మరి ఈ రకమయిన కలెక్షన్స్ తో అంటే సుందరానికీ బ్రేక్ ఈవెన్ అవడం చాలా కష్టం అనిపిస్తుంది. వచ్చే శుక్రవారం గాడ్సే, విరాట పర్వం మూవీస్ ఉన్నాయి. అంటే నిజంగా అంటే సుందరానికీ వీక్ డే కష్టాలు వెంటాడినట్టే కనిపిస్తుంది వ్యవహారం.

Ante Sundaraniki week day collections:

Ante Sundaraniki Box-office collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ