రేపు శుక్రవారం విరాట పర్వం మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సాయి పల్లవి చక్కగా చీరలు కట్టుకుని అందంగా, తెలుగు ఆడపడుచులా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విరాట పర్వం ప్రమోషన్స్ లో సాయి పల్లవి సారి లుక్స్ వైరల్ అయ్యాయి. అలాగే ఆమె స్పీచ్ కోసం ఫాన్స్ ఎగబడడము హాట్ టాపిక్ అయ్యింది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ హిట్స్ తర్వాత సాయి పల్లవి మరో హిట్ కోసం రెడీ అవుతుంది. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి కేరెక్టర్, ఆమె లుక్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి.
అయితే విరాట పర్వం సినిమా రిలీజ్ అయితే ఇకపై సాయి పల్లవి కి తెలుగులో సినిమాలు లేవు. ఆమె ఏ తెలుగు ప్రాజెక్ట్ కి సైన్ సెయ్యలేదు. టాలెంటెడ్ బ్యూటీకి టాలీవుడ్ డైరెక్టర్స్ కేరెక్టర్స్ రాయలేకపోతున్నారో.. సాయి పల్లవే ఒప్పుకోవడం లేదో కానీ.. ప్రెజెంట్ అయితే సాయి పల్లవి చేతిలో టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఏం లేవు. తెలుగు కథలు వింటున్నా అంటుంది. ఇక తమిళనాట శివ కార్తికేయన్ మూవీలో చేస్తుంది. మరి తెలుగులో సాయి పల్లవి గ్యాప్ తీసుకుంటుందో.. లేదు.. టాలీవుడ్ ఆమెకి తగిన కేరెక్టర్స్ ఇవ్వలేకపోతుందో.. అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.