Advertisementt

షాకింగ్: నయన్ పెళ్ళిలో వింత ఘటన

Tue 14th Jun 2022 09:47 PM
nayanthara,vignesh shivan,nayanthara-vignesh shivan wedding,nayanthara mother  షాకింగ్: నయన్ పెళ్ళిలో వింత ఘటన
Nayanthara mother skips Nayan - Vignesh wedding షాకింగ్: నయన్ పెళ్ళిలో వింత ఘటన
Advertisement
Ads by CJ

శింబు తో ప్రేమాయణం, ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వచ్చి బ్రేక్ అవ్వడంతో నయనతార తర్వాత విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోవడానికి ఆచి తూచి అడుగులు వేసింది. ఎట్టకేలకి తమ ఏడేళ్ల ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకువచ్చింది. ఈ ఐదేళ్లలో నయనతారకి మీడియా చాలాసార్లు పెళ్లిళ్లు చేసింది. అయితే జూన్ తొమ్మిదిన నయనతార - విగ్నేష్ శివన్ లు మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో అంగరంగ వైభవంగా చేసుకున్నారు. అటు విగ్నేష్ శివన్ ల ఫ్యామిలీ, నయనతార చుట్టాలు అందరూ పెళ్ళికి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు.

కానీ షాకింగ్ గా నయనతార పెళ్ళిలో ఆమె తల్లి కనిపించలేదు. నయనతార తల్లి నయన్ పెళ్ళిలో కనిపించకపోవడానికి కొన్ని కారణాలున్నాయని అంటున్నారు. అయితే విగ్నేష్ శివన్ తో నయన్ పెళ్లి నయనతార తల్లికి ఇష్టమే అయినప్పటికీ.. అనివార్య కారణాలవల్లే ఆమె వివాహానికి రాలేదని సమాచారం. అందుకే నయనతార భర్త విగ్నేష్ తో కలిసి కేరళ వెళ్లి అక్కడ ఆలయాల దర్శనంతో పాటుగా తల్లి దగ్గరే రెండు వారలు ఉండేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దక్షిణ కేరళలోని ఆమె స్వగ్రామంలో నయనతార తల్లి ఒమన కురియన్‌ను కలిసేందుకు వెళ్తూ ఆదివారం మధ్యాహ్నం కొచ్చి ఎయిర్ పోర్ట్ లో నయన్ - విగ్నేష్ లు కనిపించారు. 

Nayanthara mother skips Nayan - Vignesh wedding:

Nayanthara-Vignesh Shivan wedding highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ