ఈమధ్యన చాలామంది హీరోల ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు పెట్టడమే కాదు, తమ హీరోల అప్ డేట్స్ ఇవ్వకపోతే ఆయా నిర్మాణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నానా తిట్లు తిడుతూ.. ట్రెండ్ చేస్తున్నారు. హీరోల మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ.. మరీ ఇంత అభిమానం ఉండకూడదు. అయితే తమ హీరోలని ఏ హీరోయిన్స్ తో కలిసి చూడలనుకుంటున్నారు, ఏ డైరెక్టర్స్ తో సినిమా చేస్తే తమ హీరోకి మంచి మైలేజ్ వస్తుందో అనేది ఫాన్స్ ఓ ఐడియా కి రావడమే కాదు, వాటిపై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆయా హీరోలకి రిక్వెస్ట్ లు చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఫాన్స్ ఓ ఇంట్రెస్టింగ్ కాంబో ని కోరుకుంటున్నారు.
అది రామ్ చరణ్ విక్రమ్ తో భారీ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ తో సినిమా చెయ్యాలని. RC17 రామ్ చరణ్ - లోకేష్ కలయికలో రావాలి అనేది ఫాన్స్ కోరిక. ఇంతకుముందే లోకేష్ కనగరాజ్ రామ్ చరణ్ కి కథ చెప్పాడని అన్నారు. కాని అది గాసిప్పో లేదంటే నిజమో తెలియదు కానీ.. రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ మూవీ చేస్తే బావుంటుంది.. అందులో రామ్ చరణ్ సాయి పల్లవి తో రొమాన్స్ చేస్తే చూడాలి అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. రామ్ చరణ్ - సాయి పల్లవి కలిసి కనిపిస్తే ఆ సినిమాపై అంచనాలు మాములుగా ఉండవు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నేచురల్ పెరఫార్మెర్ సాయి పల్లవి స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యాలని ఆమె ఫాన్స్ కోరుకుంటారు. కనీ సాయి పల్లవి ఇప్పటివరకు ఏ స్టార్ హీరో తో సినిమా చెయ్యలేదు.