గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకి చిన్న విరామమే ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్, స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకుని కూడా మొహానికి మేకప్ వేసుకున్న కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత నటించడానికి సిద్దపడినా, తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. భర్త తో హాయిగా సంతోషంగానే ఉన్న కాజల్ మధ్యలో బేబీ బంప్ తో ఫోటో షూట్స్ చేయించుకుని తనలో గ్లామర్, ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. పండంటి మగ బిడ్డ నీల్ కిచ్లు పుట్టిన తర్వాత యదావిధిగా సోషల్ మీడియా ముందుకు వచ్చిన కాజల్ ఈ మధ్యన మళ్లీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు.
అదే టైం లో కాజల్ అగర్వాల్ తాజాగా తన కొడుకు నీల్ కిచ్లు తో ఉన్న పిక్ ని చెర్ చేస్తూ.. నా జీవితంలోని ప్రేమవు నువ్వు. నా గుండె చప్పుడివి నీవే అంటూ కొడుకు ఫోటో ని రివీల్ చేసీ.. చెయ్యకుండా మొహాన్ని దాచేసింది. కాజల్ తన కొడుకుతో గడిపిన అపూర్వ క్షణాలని ఆ విధంగా ఫోటో రూపం లో షేర్ చెయ్యగా.. సోషల్ మీడియాలో ఆ పిక్ విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.