రానా - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన విరాట పర్వం మూవీ జూన్ 17 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సాయి పల్లవి క్రేజ్, విరాట పర్వం ప్రమోషన్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా కర్నూల్ లో విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. అక్కడ గాలి దుమ్ము, వర్షంతో ఆ ఈవెంట్ ఆగిపోయినా సాయి పల్లవి క్రేజ్ కి అభిమానులు సలాం కొత్తత్రు. తర్వాత హైదరాబాద్ లో పలు ఇంటర్వూస్ పాల్గొంటున్న టీం నిన్న ఆదివారం వరంగల్ లో ఆత్మీయ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకి ప్రియమణి, రానా, సాయి పల్లవి, నవీన్ చంద్ర ఇలా విరాట పర్వం టీం మొత్తం పాల్గొనింది. అక్కడ కూడా సాయి పల్లవి నే స్టేజ్ పై హైలెట్ అయ్యింది. అయితే ఇప్పడు విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
హైదరాబాద్ లో జరగబోయే విరాట పర్వం ప్రీ రిలీజ్ వేడుకకి గెస్ట్ లుగా రాబోతున్న హీరోల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకరు రానా బాబాయ్ సీనియర్ హీరో వెంకటేష్ కాగా, రెండోవారు రానా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్. వెంకటేష్ - రామ్ చరణ్ లు ఇద్దరూ విరాట పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా హాజరు కాబోతున్నారని, జూన్ 15 సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి సాయి పల్లవి క్రేజ్ కి చరణ్, వెంకీ తోడైతే ఆ లెక్కే వేరు.