Advertisementt

పవన్-సాయి తేజ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్

Mon 13th Jun 2022 05:51 PM
pawan kalyan,sai dharam tej,ketika sharma,samuthirakani  పవన్-సాయి తేజ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్
Pawan - Sai Dharam Tej combo Heroine fix పవన్-సాయి తేజ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలయికలో తమిళ దర్శకుడు సముద్రఖని ఓ రీమేక్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లో యాక్టీవ్ పాత్ర పోషిస్తున్నప్పటికీ.. సముద్రఖని మూవీ కోసం కేవలం 20 రోజుల డేట్స్ అయితే సరిపోతాయి కాబట్టి మేనల్లుడు సాయి తేజ్ తో చెయ్యడానికి పవన్ ఒప్పుకున్నారు. సముద్రఖని కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ కి సరిపోయేలా ఆయన కేరెక్టర్ ని డిజైన్ చేస్తున్నారని, తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం ని తెలుగు నేటివిటీకి దగ్గరగా చూపించే ప్రయత్నాల్లో ఉన్నారట.

అయితే ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. వినోదయ సీతం లో సంచిత శెట్టి కేరెక్టర్ లో కేతిక శర్మ కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. రొమాంటిక్, లక్ష్య చిత్రాలతో టాలీవుడ్ లో కనిపించిన కేతిక మెగా హీరో వైష్ణవ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాలోనూ నటిస్తుంది. ఇక ఇప్పుడు సాయి తేజ్ తో జోడి కట్టబోతుంది. జులై సెకండ్ వీక్ లో మొదలు కాబోయే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కేరెక్టర్ కి సంబందించిన షూటింగ్ ముందుగా పూర్తి చేసి తర్వాత మిగతా పార్ట్ చిత్రీకరణ కంప్లీట్ చెయ్యాలని సముద్రఖని భావిస్తున్నారట. ఈ సినిమా అఫీషియల్ గా వచ్చే నెలలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం.

Pawan - Sai Dharam Tej combo Heroine fix:

Pawan Kalyan - Sai Dharam Tej combo Heroine fix

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ