ఈ రోజు ఉదయం ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్ డ్రగ్స్ కేసులో పోలీస్ లకి పట్టుబడిన న్యూస్ పలు టివి ఛానల్స్ లో మెయిన్ హైలెట్ గా నిలిచింది. బెంగుళూర్ లోని ఓ ప్రముఖ హోటల్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు డ్రగ్స్ సేవించినట్లుగా సమాచారం అందడంతో పోలీస్ లు శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్ తో పాటుగా మరో ఆరుగురు ప్రముఖులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా వార్తలు వెలువడినాయి. సోదరుడు అరెస్ట్ విషయమై శ్రద్దా కపూర్ ని స్పందించమని మీడియా కోరగా.. శ్రద్దా కపూర్ షాకింగ్ ఆన్సర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
తాను ఉదయం 9 గంటలకి నిద్రలేవగానే పోలీస్ లు సిద్దాంత్ కపూర్ ని అరెస్ట్ చేసినట్లుగా వార్తలు చూసే తెలుసుకున్నాను అని, ఆ వార్తలు చూసాకే సిద్దాంత్ అరెస్ట్ అయ్యాడని తెలిసింది. ఈ విషయమై నాకు ఏమి తెలియదు. మా ఫ్యామిలీ మొత్తం సిద్దాంత్ అరెస్ట్ విషయం తెలుసుకోవాలని ట్రై చేసినా ఫలితం లేదు. అటువైపు వారు ఫోన్స్ లిఫ్ట్ చెయ్యడం లేదు. దానితో ఏం జరుగుతుందో మాకు అసలేం అర్ధం కావడం లేదు అంటూ శ్రద్దా కపూర్ మీడియా తో మాట్లాడారు.