Advertisementt

డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన శ్రద్దా సోదరుడు

Mon 13th Jun 2022 12:08 PM
shraddha kapoor,shraddha kapoor brother siddhant kapoor,siddhant kapoor,bangalore,drugs  డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన శ్రద్దా సోదరుడు
Shraddha Kapoor brother Siddhant Kapoor has been detained in Bangalore డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన శ్రద్దా సోదరుడు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు ఎప్పటికప్పుడు ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి గత ఏడాది షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఈ డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యాడు. కొన్నాళ్ళు జైలు జీవితం గడపడం బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదంటూ ఈమధ్యనే తనకి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ ఆర్యన్ కేసు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. ఆదివారం రాత్రి బెంగళూరులో ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీలో సిద్దాంత్ కపూర్ తో పాటుగా మరో ఆరుగురు సెలబ్రిటీస్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ఆ హోటల్ జరిగే పార్టీలో నిషేదిత డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో పోలీస్ లు రైడ్ చెయ్యగా.. వీళ్ళు అడ్డంగా డ్రగ్స్ తీసుకుని దొరికిపోయినట్లుగా తెలుస్తుంది. 

వారిని దుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరిక్షలు నిర్వహించగా.. అందరూ డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలడంతో.. అసలు వీళ్ళు పార్టీకి డ్రగ్స్ తీసుకుని వచ్చారా? లేదంటే పార్టీలోనే వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా? అనేది పోలీస్ లు విచారణ చేపట్టారు. సిద్దాంత్ కపూర్ అరెస్ట్ గురించి బాలీవుడ్‌ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నటుడిగా కెరీర్ లో మంచి ఊపులో ఉన్న సిద్దాంత్ కపూర్ ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపగా.. సిద్దాంత్ కపూర్ అరెస్ట్ పై శ్రద్ద కపూర్ ఫ్యామిలీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Shraddha Kapoor brother Siddhant Kapoor has been detained in Bangalore:

Shraddha Kapoor brother Siddhant Kapoor has been detained in Bangalore after testing positive for drugs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ