నయనతార - విగ్నేష్ శివన్ లు ఏడేళ్లు ప్రేమించుకుని ఈ నెల 9 న పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. నయనతార పెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాదు హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి, తర్వాత తిరుమల దర్శనం అన్నీ మీడియాలో హడావిడి చేసాయి. అయితే నయనతార - విగ్నేష్ శివన్ లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఈ వివాహం చేసుకున్నారు. కాకపోతే పెళ్ళికి ముందు నయనతార కి విగ్నేష్ శివన్ తల్లి ఓ కండిషన్ పెట్టింది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది పెళ్లి తర్వాత నయనతార నటించకూడదు అనే కండిషన్ పెట్టారు అని, మా ఫ్యామిలిలో మొహానికి రంగు వేసుకునే కోడళ్ళు కానీ ఎవరూ కానీ లేరు అని ఆమె చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.
మరి నయనతార సాదా సీదా హీరోయిన్ కాదు. టాప్ హీరోయిన్. ఆమె హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. ఇప్పటికీ యంగ్ అండ్ స్టార్ హీరోల సినిమాలతో ఆమె డైరీ ఫుల్. అలాంటప్పుడు నయనతార కి విగ్నేష్ శివన్ తల్లి కండిషన్ పెట్టగలరా? అసలు ఆమె చెబితే మాత్రం నయన్ ఒప్పుకుంటుందా? విపరీతమైన క్రేజ్ ఉన్న నయనతార పెళ్లి తర్వాత నటించకుండా ఉండగలదా.. అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. కానీ విగ్నేష్ తల్లి అలాంటి కండిషన్ పెట్టారంటే కూడా ఎవరూ నమ్మడం లేదు.