Advertisementt

వివాదంలో మంచు విష్ణు జిన్నా టైటిల్

Sun 12th Jun 2022 07:20 PM
manchu vishnu,gali nageswararao,kona venkat,manchu vishnu jinnah movie,jinnah title controversy  వివాదంలో మంచు విష్ణు జిన్నా టైటిల్
Manchu Vishnu Jinnah movie title controversy వివాదంలో మంచు విష్ణు జిన్నా టైటిల్
Advertisement
Ads by CJ

మంచు విష్ణు ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరో. మా అధ్యక్షుడిగా రెండేళ్ల పదవి పొందడానికి ఇండస్ట్రీ లో పోరాడి గెలిచి మా అధ్యక్షుడైన మంచు విష్ణు కొన్ని కొన్ని సార్లు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో నెటిజెన్స్ చేతిలో ట్రోల్ అయ్యేలా చేసున్నాయి. మంచు హీరోలకు సక్సెస్ లేకపోవడంతో వారేమన్నా అది కాస్త కాంట్రవర్సీ అవడం, ట్రోల్ అవడం కామన్ గా మారిపోయింది. ఇక మంచు విష్ణు తాజాగా గాలి నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు. పాయల్ రాజ్ ఫుట్, సన్నీ లియెన్ నటిస్తున్న ఈ సినిమా పబ్లిసిటీ కోసం అప్పుడప్పుడు మంచు విష్ణు చేసే రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

తాజాగా మంచు విష్ణు డిఫ్రెంట్ గా తన టీం తో కలిసి గాలి నాగేశ్వరావు కి జిన్నా టైటిల్ ఫిక్స్ చేసి మోషన్ పోస్టర్ తో రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఆ జిన్నా టైటిల్ వివాదం లో పడింది. మహ్మద్ అలీ జిన్నా పేరుతొ టైటిల్ పెట్టి దానిని వేంకటేశ్వరుని ఏడు కొండల మధ్యన పెట్టడం ఏమిటి, అనేకమంది హిందువుల మరణానికి కారణమైన మహ్మద్ అలీ జిన్నా పేరుపై టైటిల్ పెట్టి ఇలా ఏడు కొండల మధ్యన పెట్టడం దేశభక్తి ఉన్న ఎవరు మెచ్చరు అంటూ బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ట్వీట్ చేసారు. అయితే ఈ జిన్నా టైటిల్ తో మహ్మద్ జిన్నా కి ఎలాంటి సంబంధం లేదని, గాలి నాగేశ్వర రావు అనే టైటిల్ కి షార్ట్ కట్ గా జిన్నా టైటిల్ పెట్టమని నిర్మాతతో చర్చించి ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని జిన్నా మేకర్స్ లో ఒకరైన కోన వెంకట్ స్పందించారు. ఇక మంచు విష్ణు టైటిల్ కి బిజెపి ఫ్రీ గా పబ్లిసిటీ చేస్తుంది అంటూ అప్పుడే నెటిజెన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేసేసారు.

Manchu Vishnu Jinnah movie title controversy:

Kona Venkat responds to Manchu Vishnu Jinnah movie title controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ