ఈ రోజు హీరో గోపీచంద్ బర్త్ డే. గోపీచంద్ బర్త్ డే రోజున ఆయన సినిమాల అప్ డేట్స్ తో సందడిగా ఉంది. గోపీచంద్ కొత్త సినిమాల అనౌన్సమెంట్, అలాగే ఆయన నటిస్తున్న సినిమాల నుండి స్పెషల్ సర్ ర్పైజ్ లతో గోపీచంద్ ని విష్ చేస్తున్నారు మేకర్స్. మారుతీ తో గోపీచంద్ చేస్తున్న పక్కా కమర్షియల్ షూటింగ్ ఈమధ్యనే పూర్తయ్యింది. నేడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
మూసాపేట్‌లోని ఏసియన్ సినిమాస్‌లో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా గ్లామర్ గా అందంగా కనిపించడమే కాదు, ఆమె డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్ - గోపీచంద్ లు తండ్రీకొడుకులుగా ఆకట్టుకున్నారు. రావు రమేష్ విలన్ గా కనిపించగా.. గోపీచంద్ లాయర్ గా స్టైలిష్ గానే కాదు, కామెడిగాను ఇరగదీసాడు. పక్క కమర్షియల్ ట్రైలర్ మొత్తం కమర్షియల్ యాంగిల్ లోనే ప్రెజెంట్ చేసారు. ఇంకా ఈ సినిమా జులై 1 న విడుదల కాబోతుంది.