ప్రభాస్ సలార్ షూటింగ్ మళ్ళీ మే లో మొదలైనప్పటినుండి ప్రభాస్ ఫాన్స్ టీజర్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మే నెలలోనే సలార్ టీజర్ ఇస్తారంటూ మేకర్స్ చెప్పినప్పటికీ.. సలార్ రెస్యూమ్ షూట్ లేట్ గా మొదలు పెట్టడంతో సలార్ టీజర్ ఇవ్వలేకపోయారు. అయితే సలార్ టీజర్ ని ప్రభాస్ బర్త్ డే కి ప్లాన్ చేస్తున్నారని అంటున్నప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం సలార్ టీజర్ ని జులై సెకండ్ వీక్ లో రిలీజ్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ పై ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో సలార్ లో మెయిన్ విలన్స్ తో పాటుగా, హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. సినిమాలో కీలకమైన యాక్షన్స్ సన్నివేశాలను ప్రస్తుతం ప్రశాంత్ నీల్ షూట్ చేస్తున్నారని అంటున్నారు. ఏదైనా ప్రభాస్ సలార్ టీజర్ కోసం ఫాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. మాస్ అవతార్ లో ప్రభాస్ ఎలా ఉంటారో.. డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయో అనే క్యూరియాసిటిలో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు.