రష్మిక లక్కీ హీరోయిన్ మాత్రమే కాదు ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియాలోనూ, అలాగే హిందీలోనూ మార్మోగుతుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ని కాదని రణబీర్ కపూర్ యానిమల్ లో రశ్మికకి ఛాన్స్ ఇచ్చాడు. అలాగే విజయ్ దేవరకొండ తో ఫ్రెండ్ షిప్, ఇంకా అమితాబ్, సిద్దార్థ్ మల్హోత్రా తో సినిమాలు రష్మికాని ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక తనకి ఎంతో ఇష్టమైన విజయ్ తో సౌత్ మూవీలో నటిస్తున్న రష్మికని బాలీవుడ్ మీడియా తెగ హైలెట్ చేస్తుంది. బాలీవుడ్ లో ప్రముఖ వెబ్ సైట్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రశ్మికని హైలెట్ చేస్తూ కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఇదంతా రష్మిక పిఆర్ టీం మ్యాజిక్ అంటూ కొంతమంది అంటున్నా.. అక్కడ ఆఫర్స్ తో రష్మిక రేంజ్ ఒక్కసారిగా పెరిగింది.
అందుకే ప్రముఖ మ్యాగజైన్స్ లో రష్మిక గ్లామర్ స్టిల్స్ ని ప్రచురిస్తున్నారు. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ పై కి ఎక్కిన రశ్మికను ఆ మ్యాగజైన్ వారు.. రశ్మికకి జస్ట్ 26. ఇప్పటికే ఆమె పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ తో పుష్ప 2 పాన్ ఇండియా మూవీ, విజయ్ తో క్రేజీ మూవీ, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటిస్తున్న రష్మిక ని చిన్న వయసులో నేషనల్ క్రష్ గా పిలవడం, అందరూ క్రష్మిక అంటూ ముద్దు చెయ్యడం వంటివి చూస్తే రష్మిక సూపర్ హీరోయిన్ కాక ఇంకేమవుతుంది అంటూ పొగిడేస్తున్నారు.