Advertisementt

మెగాస్టార్ చిరు ఇంట అపూర్వ కలయిక

Sun 12th Jun 2022 09:45 AM
chiranjeevi,salman khan,kamal haasan,chiru house,vikram success,lokesh kanagaraj  మెగాస్టార్ చిరు ఇంట అపూర్వ కలయిక
Kamal Haasan was felicitated by Megastar మెగాస్టార్ చిరు ఇంట అపూర్వ కలయిక
Advertisement
Ads by CJ

విక్రమ్ తో భారీ హిట్ అందుకున్న కమల్ హాసన్ నిన్న శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన విక్రమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. లోకేష్ కనగరాజ్ తో సహా హైదరాబాద్ కి వచ్చిన కమల్ హాసన్ కి చిరు ఇంటి నుండి ఆహ్వానం వచ్చింది. విక్రమ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా కమల్ హాసన్ ని చిరు ఘనంగా సన్మానించారు. 

ఇదే సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. అలాగే మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనగా మెగాస్టార్ చిరంజీవి ఆయన మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ వేడుకకు విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ కూడా పాల్గొన్నారు. కమల్ - చిరు - సల్మాన్ ముగురు కలిసి ఉన్న ఫ్రెమ్ ని చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సన్మానం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kamal Haasan was felicitated by Megastar:

Chiranjeevi And Salman Khan Felicitate Kamal Haasan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ