పాన్ ఇండియా స్టార్ గా రష్మిక బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి ట్రై చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో రష్మిక ఊపిరి సలపనంతా బిజీ తారగా మారింది. బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్, అమితాబచ్చన్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తుంది. ఇటు సౌత్ లోను రష్మిక ఫుల్ బిజీ. లక్కీ హీరోయిన్ గా తెలుగులో పుష్ప 2, అలాగే తమిళనాట తనకిష్టమైన విజయ్ తో Thalapathy66 లో నటించేస్తుంది. తాజాగా తాను సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న యానిమల్ విషయాలను పంచుకుంది.
రణబీర్ కపూర్ హీరోగా తెరేకేక్కుతున్న యానిమల్ షూటింగ్ కొత్త షెడ్యూల్ ముంబైలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్న రష్మిక.. ఫస్ట్ డే లుక్ టెస్ట్ కి వెళ్ళాను. బాలీవుడ్ హీరో రణబీర్ ఎలా ఉంటాడో అని చాలా భయపడ్డాను. ఐదు నిమిషాల్లోనే రణబీర్ గురించి అర్ధమైపోయింది. తనెంత సింపుల్ గా ఉంటాడో అనేది. ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొన్నాము. రణబీర్ తో పని చెయ్యడం చాలా హ్యాపీ గా ఉంది. ఇక ఇండస్ట్రీలో నన్ను మామ్ అని పిలిచేది ఒక్క రణబీర్ అంటూ రష్మిక రణబీర్ తో వర్క్ చెయ్యడం పై ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చింది.