ఈమధ్య కాలంలో ఏ స్టార్ హీరో బర్త్ డే వచ్చినా.. సోషల్ మీడియా మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తడం, ఆ రోజంతా ఆ బర్త్ డే టాపిక్ ట్రేండింగ్ లో ఉండడం సహజం అయిపొయింది. అదేమిటో చిత్రంగా బాలయ్య పట్ల మాత్రం మిగతా సెలబ్రిటీస్ ఎవరూ స్పందించకపోవడం నందమూరి ఫాన్స్ మండిపడేలా చేస్తుంది. నిన్న శుక్రవారం జరిగిన బాలయ్య బర్త్ డే కి ఆయన సమకాలీన హీరోలైన చిరంజీవి గాని, నాగార్జున గాని, వెంకటేష్ గాని, మోహన్ బాబు కానీ నలుగురిలో ఏ ఒక్కరూ విష్ చెయ్యకపోవడం గమనార్హం. ఆ నలుగురికీ ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నప్పటికీ, వారు ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉన్నప్పటికీ.. సభ్యత కోసమైనా స్పందించకపోవడం, సాటి సీనియర్ నటుడికి శుభాకాంక్షలు చెప్పి సంస్కారం చాటుకోకపోవడం విచారించదగ్గ విషయం.
అటు సీనియర్స్ మాత్రమే కాదండోయ్ సోషల్ మాధ్యమాల్లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే ఈతరం హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, నాని వంటి వాళ్ళు కూడా విష్ చెయ్యకపోవడం బాలయ్య అభిమానులకి విపరీతమైన కోపం తెప్పిస్తే.. చిరంజీవి బర్త్ డే కి, రామ్ చరణ్ బర్త్ డే కి పనిగట్టుకుని మరీ విష్ చేసిన తారక్ బాలా బాబాయ్ కి విష్ చెయ్యకపోవడం ఆ కోపం కట్టలు తెంచుకునేలా చేసింది. ఇలా బాలయ్య బర్త్ డే ని నిర్లక్ష్యం చేసిన వారిలో హీరోలు మాత్రమే కాదండోయ్.. తమ సినిమాల పబ్లిసిటీ కోసం, పక్క సినిమాలపై పొగడ్తలు కురిపించడం కోసం తరచుగా పోస్ట్ లు పెట్టే పలువురు దర్శకులు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి. మీ అందరి పట్ల మా స్పందనా ఏమిటో నెక్స్ట్ మీ బర్త్ డే లు వచ్చినప్పుడు, మీ సినిమాలు వచ్చినప్పుడు చూస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నందమూరి సైన్యం.
అయితే ఒక్క బాలయ్య పట్ల పరిశ్రమంతా ఎందుకిలా ప్రవర్తించింది అనేది నిజంగానే చర్చనీయాంశమైంది