మెగా ఫ్యామిలీ నుండి హీరో సినిమా వస్తుంది అంటే విపరీతమైన అంచనాలు, క్రేజ్ లేకపోయినా ఎంతో కొంత హైప్ అయితే ఉంటుంది. అందరూ రామ్ చరణ్, అల్లు అర్జున్ అయ్యిపోరు కదా.. అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ ఏజ్, వైష్ణవ తేజ్ లు ఉంటారు. మీడియం బడ్జెట్ సినిమాలతో ఆడియన్స్ మెప్పుపొందడానికి ప్రయత్నం చేసినా.. వాళ్ళకి ఫ్యామిలీ అండ ఉంది. వాళ్ళ సినిమాల ఈవెంట్స్ కి మెగాస్టారో, పవన్ కల్యాణో, చరణో, అల్లు అర్జునో వస్తారు. సినిమాని పబ్లిసిటీ చేస్తారు. దానితో ఆడియన్స్ లో ఎంతో కొంత సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే మెగాస్టార్ చిరు అల్లుడిగా టాలీవుడ్ కి విజేత తో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం కళ్యాణ్ దేవ్ కి అండగా నిలబడింది.
కానీ శ్రీజ తో పొరపొచ్చాలు కారణంగా ఇప్పుడు కళ్యాణ్ దేవ్ కెరీర్ అడకత్తెరలో పోక చెక్కలా తయారయ్యింది. శ్రీజ తో గొడవ అనే విషయం బయటికి రాగానే కళ్యాణ్ దేవ్ మార్కెట్ సడన్ గా పడిపోయింది. దానితో సూపర్ మచ్చి థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటిటిలోకి వచ్చేసింది. ఎలాంటి హడావిడి, చడీ చప్పుడు లేకుండా రిలీజ్ అయ్యి వెళ్ళిపోయింది. తర్వాత కిన్నెరసాని థియేటర్స్ లోకే వస్తుంది అనుకుంటే.. అది కూడా చిరు అండలేకుండా థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడం కష్టమని మేకర్స్ దానిని ఓటిటిలో రిలీజ్ చేసారు. నిన్ననే శుక్రవారం జీ 5 ఓటిటినుండి రిలీజ్ అయిన కిన్నెరసానికి రివ్యూస్ కూడా వచ్చిన పాపాన పోలేదు. కళ్యాణ్ దేవ్ ని పట్టించుకున్న ఆడియన్స్ కూడా లేరు. అంతేమరి మెగా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అండ లేకపోతే ఆయన హీరోగా మళ్ళీ కనిపించే అవకాశం కూడా లేదు.