పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో చేసిన ప్రణీత సుభాష్.. అంతకుముందు ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించినా ఆమెకి అంతగా క్రేజ్ రాలేదు. హీరోయిన్ గా టాప్ పొజిషన్ కి చేరలేని ప్రణీత కరోనా లాక్ డౌన్ టైం లో నిరుపేదలకు అండగా నిలబడి బాగా హైలెట్ అయ్యింది. అదే కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టింది. భర్త తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న ప్రణీత తన భర్త పుట్టిన రోజునాడు తాను తల్లికాబోతున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది.
మధ్యలో బేబీ బంప్ తో ఫోటో షూట్స్ అంటూ తరచూ సోషల్ మీడియా ద్వారా అభినులకి దగ్గరగా ఉంటూ వస్తుంది. బాత్ టబ్, స్విమ్మింగ్ పూల్ ఇలా బేబీ బంప్ తో ప్రణీత ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని షేర్ చేసింది. తాజాగా ప్రణీత పండంటి ఆడబిడకి కి జన్మనిచ్చినట్లుగా సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. తాను ఆడబిడ్డని ప్రసవించాను అని, తనకి డెలివరీ అయ్యేందుకు సహకరించిన డాక్టర్స్ కి కృతఙ్ఞతలు చెబుతూ.. ప్రణీత సుభాష్ తన హాస్పిటల్ ఫొటోస్ ని షేర్ చేసింది.