Advertisementt

శ్రీవారి సేవలో కొత్త దంపతులు నయన్-విగ్నేష్

Fri 10th Jun 2022 04:52 PM
nayanthara,vignesh shivan,tirupati temple,nayan and vignesh  శ్రీవారి సేవలో కొత్త దంపతులు నయన్-విగ్నేష్
Nayanthara and Vignesh Shivan visit Tirumala Tirupati శ్రీవారి సేవలో కొత్త దంపతులు నయన్-విగ్నేష్
Advertisement
Ads by CJ

నిన్న జూన్ 9 న ఏడేళ్ల ప్రేమని పెళ్లి తో పదిలం చేసుకుంది నయనతార - విగ్నేష్ శివన్ ల జంట. మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో జరిగిన వీరి పెళ్ళికి రజినీకాంత్, షారుఖ్, కార్తీ, సూర్య, విజయ్ లాంటి సెలబ్రిటీస్ హాజరవగా.. రజినీకాంత్ చేతుల మీదుగా తాళి బొట్టు తీసుకున్న విగ్నేష్ శివన్ దానిని నయనతార మెడలో కట్టారు అని తెలుస్తుంది. ఇక నయనతార ఎరుపురంగు చీరలో మెడ నిండా డైమండ్స్, పచ్చల ఆభరణాలతో పెళ్లి కూతురుగా మెరిసిపోయింది. విగ్నేష్ శివన్ తెలుపు రంగు బట్టల్లో పసుపుతో తడిచిపోయాడు. నిన్న అంగరంగ వైభవంగా నయన్- విగ్నేష్ పెళ్లి జరిగింది.

అయితే ముందుగా వీరి పెళ్లి తిరుపతిలోని శ్రీవారి సన్నిధిలో జరగాల్సి ఉండగా.. సెలబ్రిటీస్ కి రావడానికి ఇబ్బందులు తలెత్తుతాయని, అలాగే సామాన్య ప్రజలకు ఇక్కట్లు ఉంటాయని తమ పెళ్లిని మహాబలిపురానికి మార్చినట్లుగా విగ్నేష్ తెలిపాడు. పెళ్లి తర్వాత నయనతార - విగ్నేష్ శివన్ లు మొదటిసారి తిరుపతికి విచ్చేసి అక్కడ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. తర్వాత వారు టెంపుల్ నుండి బయటకి వస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నుదుటున కుంకుమ, మేడలో తాళిబొట్టు, నిండుగా చీరలో నయనతార చూడముచ్చటగా ఉంది అంటున్నారు. ప్రస్తుతం కొత్త దంపతుల తిరుపతి ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Nayanthara and Vignesh Shivan visit Tirumala Tirupati :

Newlyweds Nayanthara and Vignesh Shivan to visit Tirupati temple today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ