టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. మహేష్ లాంటి హీరోతో మళ్ళీ మళ్ళీ జోడి కడుతుంది. పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి సిద్ధం గా ఉంది. అలా వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించిన పూజ హెగ్డే కి ఇప్పుడు వరసగా మూడు షాక్ లు తగిలాయి. అందులో రాధే శ్యామ్ పాన్ ఇండియా షాక్. మరొకటి స్టార్ హీరో విజయ్ బీస్ట్ షాక్. ఇంకొకటి రామ్ చరణ్ తో ఆచార్య షాక్. ఇంకేంటి అమ్మడు పనైపోయింది. పూజ హేగ్డ్ కి ఆఫర్స్ రావడం కష్టమనే మాట వినిపించింది. కానీ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో చేస్తున్న జన గణ మన కోసం పూజ హెగ్డే నే హీరోయిన్ గా తీసుకువచ్చాడు.
దానితో అమ్మడు రేంజ్ కానీ, క్రేజ్ తగ్గలేదని అర్ధమైంది. అయితే మూడు ప్లాప్స్ ఉన్నప్పటికీ పూజ హెగ్డే మాత్రం రెమ్యునరేషన్ పరంగా తగ్గేదేలే అంటుందట. గ్లామర్ డోస్ తో పాటుగా పారితోషకం లెక్కలని పెంచుతున్న పూజ హెగ్డే జేజిఎమ్ కోసం 5కోట్లు డిమాండ్ చేసిందట. అటు బాలీవుడ్ లోను రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలతో నటిస్తుంది కాబట్టే ఆమె డిమాండ్ చేసింది కాదనకుండా పూరి జగన్నాధ్ బాచ్ ఇవ్వడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది.