ఇప్పుడు జబర్దస్త్ లో కామెడీ చెయ్యాల్సింది పోయి అక్కడ ట్రేజడి చేస్తున్నారు కమెడియన్స్. జబర్దస్త్ అంటే కామెడీ షో.. కానీ ఇప్పుడు జబర్దస్త్ అంటేనే కామెడీ అయ్యిపోయింది. టాప్ కమెడియన్స్ సుధీర్, ఆది, అభి లాంటి వాళ్ళు జబర్దస్త్ వదిలేసారు. ఏదో సీరియల్ ఆర్టిస్ట్ లతో జబర్దస్త్ లో కామెడీ చేయిస్తున్నారు నిర్వాహకులు. ఇక జబర్దస్త్ స్టేజ్ పై అప్పుడప్పుడు కమెడియన్స్, జెడ్జెస్, ఇంకా యాంకర్స్ కన్నీళ్లు పెట్టుకుంటారు. కొంతమంది అయితే తమ ఫ్యామిలీ స్థితిగతులను చెప్పి ఏడుస్తారు. అయితే ఇదంతా టీఆర్పీలోని భాగమే అనుకుంటారు, అంటారు చాలామంది.
కానీ జబర్దస్త్ లోకి సుడిగాలిలా వచ్చి గ్లామర్ షో తో యాంకర్స్ కే గట్టి పోటీ ఇస్తున్న వర్ష మాత్రం జబర్దస్త్ లో పెట్టుకునే కన్నీళ్లు టీఆర్పీ కోసం కాదని అదంతా నిజమే అని చెబుతుంది. జబర్దస్త్ కమెడియన్స్ మధ్య మంచి అనుబంధం ఉంది అని, ఎవరికి కష్టం వచ్చినా అందరూ నిలబడతారని, అలాగే జబర్దస్త్ ని ఎవరు వదిలి వెళ్ళిపోయినా వారి గురించి బాధపడతామని చెప్పిన వర్ష తాను గతంలో సినిమాల్లో నటించాను అని, కానీ జబర్దస్త్ లోకి వచ్చాక జబర్దస్త్ వర్షగా బాగా గుర్తింపు పొందాను అని, అందుకే ఇకపై సినిమాల్లో నటించను అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది ఈ వర్ష.