పాలిటిక్స్ లో గొడవ పడడం ఈజీనే కానీ సినిమాలు చూడాలంటే భయం అంటూ పవన్ కళ్యాణ్ ఫన్నీ కామెంట్స్ చేసారు. నాని అంటే సుందరానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ హీరో నానికి తమ ప్యామిలీలో నే అభిమానులు ఉన్నారని, ఆయన సినిమాలు బావుంటాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తన ఏవి చూస్తున్నంత సేపు ఫన్నీగా అనిపించింది అని, కాకపోతే చివరిలో డాన్స్ స్టెప్స్ వేసిన క్లిప్పింగ్స్ చూపించేసరికి భయం వేసింది అని, ఆ డాన్స్ చేసింది నేనేనా అనిపించింది, మ్యూజిక్ వస్తుంటే అలా నడుచుకుంటూ వెళ్లడం ఇష్టమని, కానీ దర్శకులు నాతో చిన్న చిన స్టెప్స్ వేయిస్తారని, డాన్స్ వెయ్యడం ఇష్టం ఉండదు.
కానీ అభిమానులకి భయపడి డాన్స్ చేస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ ఏ ఒక్క ఫ్యామిలీ సొత్తు కాదని, అందరికి ఈ ఇండస్ట్రీ సమానమేనని చెప్పారు. ఇక చివరిలో పవన్ కళ్యాణ్ ఫన్నీగా క్షమించండి నివేద థామస్ గురించి మీకు చెప్పడం మరిచిపోయాను అంటూ మైక్ తీసుకుని కామెడీ చేసి మరీ స్టేజ్ దిగిపోయారు పవన్.