నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ.. నేడు శుక్రవారం వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. శ్యామ్ సింగ రాయ్ లో గంభీరమైన పాత్రతో ఆకట్టుకున్న నాని అంటే సుందరానికీ లో ఫన్నీ కేరెక్టర్ చేసాడు. అందులో వివేక్ ఆత్రేయ డైరెక్టర్ కావడంతో ఈ సినిమా ఫన్ రైడర్ గా ఉండబోతుంది అని ట్రైలర్ లోనే అర్ధమైపోయింది. ఇక అంటే సుందరానికీ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సినిమాని వీక్షించిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సన్నిహితులతో పంచుకుంటున్నారు.
అంటే సుందరానికీ ఆడియన్స్ నుండి ఊహించని టాక్ అయితే వచ్చింది. అంటే కొంతమంది బావుంది అని, కొందరు పర్వాలేదు అని, మరికొందరు యావరేజ్ అంటూ ఆ సినిమాకి రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా ఉంది అని, కథలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు ఎక్కువ టైం తీసుకున్నాడని అంటున్నారు. అలాగే సెకండ్ హాఫ్ కామెడీ తో లాగించేశారట. నాని, నజ్రియా తమ యాక్టింగ్ ఇరగదీసేశారట. ఇంకా బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీలు సినిమాకు ప్లస్ అంటున్నారు. అలాగే ఫస్టాఫ్ స్లో గా ఉండడం, పాటలు, ఎమోషన్స్ పండకపోవడం, సినిమా నిడివి ఎక్కువగా ఉండడం ఈ సినిమాకు ప్రధానమైన మైనస్‌గా లుగా చెబుతున్నారు. దాదాపుగా మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ని చూస్తూ ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యేఅవకాశం ఉంది అంటున్నారు. సో అలా ఉంది అంటే సుందరానికి ఓవర్సీస్ టాక్.