బాలకృష్ణ వరస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉండడమే కాదు, అటు పాలిటిక్స్ లోను బాలయ్య బిజినే, మహానాడులో బాలకృష్ణ హడావిడి చేసారు. ఇప్పటికీ యంగ్ హీరో మాదిరిగా చాలా ఎనేర్జిగా కనిపించే బాలయ్య అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో తో దుమ్ములేపారు. అఖండ అంటూ గర్జించిన బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని తో సింహం వేట షురూ అంటూ NBK107 తో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పేస్తున్నారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా NBK107 నుండి టీజర్ వదిలింది టీం. అదే బాలయ్య బర్త్ డే కి మరో స్పెషల్ అప్ డేట్ రాబోతుంది.
అది అనిల్ రావిపూడితో బాలయ్య మూవీ ఎనౌన్సమెంట్ రాబోతుంది. అనిల్ రావిపూడి తో కేవలం సినిమా ప్రకటన మాత్రమే కాదు, ఆ సినిమా టైటిల్ ని రేపు జూన్ 10 బాలయ్య బర్త్ డే సందర్భంగా రివీల్ చెయ్యబోతున్నారు. బ్రో.. ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య - అనిల్ రావిపూడి టైటిల్ ని రివీల్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. F3 హిట్ తో ఖుషీగా ఉన్న అనిల్ రావిపూడి బాలయ్య పుట్టిన రోజునాడు ఆయనతో చెయ్యబోయే మూవీ టైటిల్ ఇస్తున్నారు ఫాన్స్ కి. బాలయ్యతో తాను చెయ్యబోయే మూవీ చాలా డిఫ్రెంట్ గా ఉంటుంది అని, బాలయ్య ని నడి వయస్సు పాత్రలో పవర్ ఫుల్ గా చూపించబోతున్నాను అని, నా కామెడీ, బాలయ్య మాస్ కాకుండా డిఫ్రెంట్ గా తమ సినిమా ఉండబవుతుంది అంటూ అనిల్ రావిపూడి ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు బ్రో ఐ డోంట్ కేర్ అంటుంటే నిజంగానే బాలయ్య కొత్తగా కనిపిస్తారని అర్ధమవుతుంది.