నందమూరి నట సింహం బాలయ్య నోటి నుండి పవర్ ఫుల్ డైలాగ్ వస్తే ఆయన ఫాన్స్ కి పూనకాలే. ఏ హీరోకి లేని వాయిస్ పవర్ బాలయ్య సొంతం. అందుకే ఆయన డైలాగ్స్ కి నందమూరి ఫాన్స్ సలాం కొడతారు. బాలయ్య లుంగీ కట్టి మీసం మెలేస్తే .. అవతలి వాడికి ప్యాంట్ తడిచిపోవాల్సిందే. బాలకృష్ణ నోటివెంట పవర్ ఫుల్ డైలాగ్ వింటే విలన్స్ ఒణికిపోవాల్సిందే. అఖండ లా గర్జించి.. ఇప్పుడు NBK107 వర్కింగ్ టైటిల్ తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఫాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇచ్చేసారు బాలకృష్ణ.
NBK 107 నుండి మేకర్స్ పవర్ ఫుల్ టీజర్ వదిలారు. బాలకృష్ణ పవర్ ఫుల్ లుక్ కి తోడు పవర్ ఫుల్ డైలాగ్స్ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు. ఇక బాలయ్య చుట్ట కాల్చే స్టయిల్, అలాగే బాలయ్యకి అచ్చొచ్చిన లక్ష్మి నరసింహ ప్రతిమలతో టీజర్ ని మొదలు పెట్టి మాస్ యాక్షన్ గా వరసగా కార్లని చూపిస్తూ బాలయ్య తో అదిరిపోయే డైలాగ్స్ చెప్పించాడు గోపీచంద్ మలినేని. మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్, నా జీవో గాడ్స్ ఆర్డర్. భయం నా బయో డేటాలోనే లేదురా బోసు డీకే, నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకి కూడా తెలియదు అంటూ చెప్పిన బాలయ్య డైలాగ్స్ టీజర్ కె హైలెట్ అంటుంటే.. బాలయ్య చేసిన యాక్షన్ కూడా డైలాగ్స్ కి మించి ఉంది. నందమూరి ఫాన్స్ మాత్రం మా బాలయ్య కి ఇదే కదా కావాల్సింది అంటూ పండగ చేసుకుంటున్నారు. బాలయ్య బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ ఈ టీజర్ అనేలా ఉంది.
NBK107 టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి