ఎట్టకేలకు నయనతార - విగ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అనడమే కానీ నయనతార-విగ్నేష్ లు పెళ్లి చేసుకోలేదు. దానికి విగ్నేష్ శివన్ పెళ్లంటే ఖర్చుతో కూడుకున్నది. అందుకే బాగా సంపాదించాకే పెళ్లి అంటూ మాట దాటేస్తూ ఉండేవాడు. ఇక నేడు జూన్ 9 న నయనతార - విగ్నేష్ శివన్ లు అఫీషియల్ గా పెళ్లితో భార్యా భర్తలుగా మారారు. గత కొన్ని రోజులుగా నయనతార పెళ్లి మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నేడు మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో ఈ జంట ఏడడుగులు బంధంతో ఒక్కటయ్యింది. రజినీకాంత్, సూర్య, విజయ్, షారుఖ్ ఖాన్, రాధికా, కార్తి లాంటి స్టార్ హీరోలు నయనతార పెళ్లిలో సందడి చేసారు.
అయితే నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి పై ఫాన్స్ లోనే కాదు ప్రతి ఒక్క సినిమా లవర్ లో ఎంతో ఆసక్తి నెలకొంది. సినిమాల్లో పెళ్లి కూతురు గెటప్ లో నయనతారని చాలాసార్లు చూసినా ఆమెని రియల్ పెళ్లి కూతురుగా చూడాలని చాలామంది కోరుకున్నారు. శింబు, ప్రభుదేవాతో పెళ్లి ఆగిపోయాక నయనతార మళ్ళీ ఇప్పటికి విగ్నేష్ శివన్ ని పెళ్లాడింది. మరి నయనతార - విగ్నేష్ శివన్ లు పెళ్లి బట్టల్లో మెరిసిపోవడమే కాదు, పెళ్లి కూతురు - పెళ్లి కొడుకుగా అదిరిపోయారు. ఎరుపు రంగు చీరలో మెడ నిండా పచ్చలతో చేసిన ఆభరణాలతో నయనతార, తెల్లని దుస్తుల్లో విగ్నేష్ ల పెళ్లి హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది. ఇంతకుముందే నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది కాస్తా విపరీతంగా వైరల్ అయ్యింది.