Advertisementt

పవన్ మామిడిపళ్ళు అందుకున్న దర్శకుడు

Wed 08th Jun 2022 01:00 PM
pawan kalyan,mangoes,vakeel saab,director venu sriram  పవన్ మామిడిపళ్ళు అందుకున్న దర్శకుడు
Pawan Send Mangoes For Venu Sriram పవన్ మామిడిపళ్ళు అందుకున్న దర్శకుడు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో తనకు అత్యంత సన్నహితులైన వాళ్ళకి గిఫ్ట్స్ పంపించడం ఆనవాయితీగా వస్తుంది. ఆయన భార్య అన్నా క్రిష్ట్మస్ కి ప్రత్యేకంగా మహేష్ బాబు ఫ్యామిలీకి గిఫ్ట్స్ పంపుతారు. అలాగే పవన్ కళ్యాణ్ తన తోటలో పండిన మామిడి పళ్ళని తనకిష్టమైన హీరో నితిన్, త్రివిక్రమ్, మహేష్ లాంటి వాళ్లకు పంపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి మరో డైరెక్టర్ చేరారు. పవన్ కళ్యాణ్ నుండి మామిడి పళ్ళని గిఫ్ట్ గా అందుకున్న దర్శకుడి భార్య ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ థాంక్స్ కూడా చెప్పింది.

మరి పవన్ నుండి ప్రేమగా ఆ మామిడిపళ్ళు అందుకున్నది ఎవరో కాదు దర్శకుడు వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ కి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన వేణు శ్రీరామ్ కి పవన్ కళ్యాణ్ తన ఫామ్ లో పండిన మామిడి పళ్ళని గిఫ్ట్ గా పంపిన విషయాన్ని వేణు శ్రీరామ్ భార్య తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేస్తూ థాంక్యూ సర్, థాంక్యూ పవన్ కళ్యాణ్ గారు మీ ఫామ్ లో పండిన ఫ్రెష్ మామిడిపళ్ళని పంపినందుకు చాలా హ్యాపీ గా ఉంది అంటూ షేర్ చెయ్యగానే అది కాస్తా వైరల్ అయ్యింది.

Pawan Send Mangoes For Venu Sriram:

Pawan Kalyan Send Mangoes For Vakeel Saab Director Venu Sriram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ