Advertisementt

SSMB28 అప్ డేట్ కోసం వెయిటింగ్

Tue 07th Jun 2022 10:27 PM
ssmb28,mahesh babu,trivikram,mahesh -trivikram combo,ssmb28 update  SSMB28 అప్ డేట్ కోసం వెయిటింగ్
Waiting for SSMB28 update SSMB28 అప్ డేట్ కోసం వెయిటింగ్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సర్కారు వారి పాట ముచ్చట తీరిపోయింది. మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్స్ కూడా వెళ్లిపోయారు. మే 31 న కృష్ణ గారి బర్త్ డే కి మహేష్ బాబు త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 అప్ డేట్ వస్తుంది అనుకుంటే త్రివిక్రమ్ మోసం చేసారు. త్రివిక్రమ్ తో మూవీ జూన్ లో మొదలవుతుంది అని మహేష్ బాబు సర్కారు వారి ప్రమోషన్స్ లో చెప్పారు. మరి జూన్ వచ్చేసింది. అప్పుడే పది రోజులు పూర్తయ్యాయి. కానీ మహేష్ బాబు ఇప్పటివరకు త్రివిక్రమ్ మూవీ సెట్స్ లోకి వెళ్ళలేదు.

అసలు SSMB28 ఎప్పుడు మొదలవుతుందో కూడా అప్ డేట్ కూడా ఇవ్వడం లేదు. దానితో మహేష్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అవుతున్నారు. SSMB28 రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందో చిన్న అప్ డేట్ ఇస్తే మీ సొమ్మేం పోతుంది అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తో పాటుగా మరో హీరో కూడా ఉంటారని అంటున్నారు. హీరో నాని SSMB28 లో కనిపిస్తారని అన్నా.. నాని మాత్రం అదేం లేదు, నేను ఏ హీరో సినిమాలో గెస్ట్ రోల్ చెయ్యడం లేదు అని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు ఆ హీరో ఎవరనే దాని మీద ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మహేష్ కి జోడిగా పూజ హెగ్డే మరోసారి SSMB28 లో జత కట్టబోతుంది. 

Waiting for SSMB28 update:

SSMB28 update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ