నయనతార-విగ్నేష్ శివన్ ల ఏడేళ్ల బంధం ఈ నెల 9 గురువారం చెన్నై సమీపంలోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్స్ లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతుంది. నయనతార - విగ్నేష్ శివన్ ల పెళ్లి ఇప్పుడు మీడియాలో నడుస్తున్న టాపిక్. గతంలో శింబు, ప్రభుదేవాలతో నయనతార పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. అందుకే విగ్నేష్ శివన్ తో ఇన్నేళ్లు పెళ్లి మాటెత్తకుండా బంధాన్ని కొనసాగించిన నయనతార ఫైనల్లీ తాళి కట్టించుకోవడానికి రెడీ అయ్యింది. ఈ పెళ్ళికి తమిళనాడు సీఎం తో పాటుగా అగ్రహీరోలు, హీరోయిన్స్ కూడా హాజరవుతారని తెలుస్తుంది.
అయితే నయనతార కోసం విగ్నేష్ శివన్ కొన్ని కోట్లు పెట్టి కొన్న నగలను కానుకగా ఇవ్వబోతున్నాడట. నయన్ కూడా తన పెళ్ళిలో విగ్నేష్ శివన్ స్పెషల్ గా తయారు చేయించిన నగలను ధరించబోతుంది అంటున్నారు. అంతేకాకుండా విగ్నేష్ స్పెషల్ గా నయన్ కోసం ఓ డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఇక నయనతార కూడా విగ్నేష్ శివన్ కి లైఫ్ లో ఎప్పటికి మరిచిపోలేని కానుకని ఇవ్వబోతుందట. అది చెన్నైలోని పోర్ష్ ఏరియాలో ఓ ప్రత్యేకమైన ఇంటిని కొనొగోలు చేసి భర్త విగ్నేష్ పేరు మీద రిజిస్టర్ చేయించి మరీ కానుకగా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ ఇంటి ఖరీదు ఏకంగా 20 కోట్లట. ఆ ఇంట్లోనే నయనతార విగ్నేష్ శివన్ తో కలిసి కొత్త కాపురం పెట్టబోతుందట. మరి నయన్ పెళ్లి ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో.. ఇప్పుడు ఆ పెళ్లిలో కానుకలు అంతే హాట్ టాపిక్ అవ్వబోతున్నాయంటున్నారు.